Thursday, September 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా రక్షణ వ్యవస్థలపై పెరుగుతున్న ఒత్తిడి

అమెరికా రక్షణ వ్యవస్థలపై పెరుగుతున్న ఒత్తిడి

- Advertisement -

ఇరాన్‌పై పోరుతో తరిగిపోతున్న నిల్వలు
వాషింగ్టన్‌
: ఇరాన్‌పై జరుగుతున్న పోరు కారణంగా అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి పెరిగిపోతోంది. జోర్డాన్‌పై ఇటీవల ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడిని ఎదుర్కోవడానికి అమెరికా సైన్యం ఏకంగా సుమారు 70 పేట్రియాట్‌ ఇంటర్‌సెప్టర్‌లను, డజనుకు పైగా థాడ్‌ క్షిపణి నిరోధక ఇంటర్‌సెప్టర్‌లను ఉపయోగించింది. ఈ పరిణామం అమెరికా రక్షణ రంగంపై పెరుగుతున్న ఒత్తిడిని సూచిస్తోందని ‘ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ పత్రిక తెలియజేసింది. జోర్డాన్‌పై ఇరాన్‌ సుమారు 20 బాలిస్టిక్‌ క్షిపణలను ప్రయోగించింది. వాటిని తిప్పికొట్టడానికి అమెరికా సేనలు పెద్ద ఎత్తున రక్షణ వ్యవస్థలను వాడాయని ఆ పత్రిక వివరించింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల్లో అమెరికా సేనలు ఓ వారంలో ఉపయోగించిన మొత్తం వ్యవస్థల సంఖ్యకు ఇది దాదాపుగా సమానం. ఇరాన్‌ ప్రయోగించిన వార్‌హెడ్లు లక్ష్యాలను సమీపించే సమయంలో అనేక భాగాలుగా విడిపోతాయని, అప్పుడు వాటిని అడ్డుకునేందుకు జరిపే ప్రయత్నాలు సంక్లిష్టంగా మారతాయని పత్రిక తెలిపింది.
ఓ వైపు నిల్వలు తరిగిపోతున్నప్పటికీ అమెరికా రక్షణ వ్యవస్థలు అన్ని దాడులనూ నిరోధించ లేకపోతున్నాయి. ఘర్షణల సమయంలో ఇరాన్‌ దాడులు సంక్లిష్టంగా మారాయని, అమెరికా రక్షణ వ్యవస్థలను ఛేదించే ప్రయత్నంలో వివిధ రకాల క్షిపణులు, ఆయుధాలు, వార్‌హెడ్లను ఉపయోగిస్తు న్నారని కొందరు అధికారులు ‘ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ పత్రికకు చెప్పారు. తమ వద్ద గగనతల రక్షణ వ్యవస్థల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వాటి ఉత్పత్తిని మరింతగా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల క్రితమే చెప్పుకొచ్చారు. అయితే ఇరాన్‌తో సంఘర్షణ వ్యూహాత్మక నిల్వల కొరతకు దారితీసిందని రక్షణ శాఖ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ ఓ నివేదికలో తెలియజేశారు. జూన్‌ మధ్య నాటికి అమెరికా సుమారు 1,700 పేట్రియాట్‌ ఇంటర్‌సెప్టర్‌లను, 200కు పైగా థాడ్‌ ఇంటర్‌సెప్టర్‌లను ఉపయోగించిందని అధికారులు అంటున్నారు. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల పైకి అమెరికా నౌకాదళం సుమారు 150 స్టాండర్డ్‌ మిస్సైల్‌ ఇంటర్‌సెప్టర్‌లను ప్రయోగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -