Saturday, September 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపాలస్తీనాపై ఢిల్లీ డిక్లరేషన్‌- అంధభక్తులకు గుణపాఠం

పాలస్తీనాపై ఢిల్లీ డిక్లరేషన్‌- అంధభక్తులకు గుణపాఠం

- Advertisement -

తాను హోమియోపతి మందు ఇచ్చానని మోడీ చెప్పుకోవడం తనపై తాను దాడి చేసుకోవడం వంటిదే. అదేదో విజయ వంతమైన వ్యూహం కాదు సరికదా ఓటమి కొనితెచ్చుకోవడంగా రుజువవుతున్నది. అంతులేని నిస్పృహలో కూరుకు పోయి వున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. హిందూత్వ పాలనతో విభేదించే వారందరిపైనా దిమాగీ నక్సల్స్‌‌ (ఆలోచనా పరమైన నక్సల్స్‌‌)గా ముద్ర వేయడం బట్టి చూస్తే-మోడీని, ఆయన భావాలను బలపర్చేవారందరూ బుర్ర లేని అంధ భక్తులని- (‌గైర్‌ ‌దిమాగీ) ఒకే నిర్ణయానికి రాక తప్పని పరిస్థితి. ఈ అసంబద్ధ ఆలోచనా ధోరణికి ఉదాహరణ కావాలంటే పాలస్తీనాపై బ్రిక్స్‌ ఢిల్లీ డిక్లరేషన్‌ ‌కన్నా మరొకటి వుండదు. మోడీ అంతకంతకూ ఇజ్రాయిల్‌‌కు సన్నిహితుడుగా మారడంతో ఈ గైర్‌‌ దిమాగీ అంధ భక్తులు యూదు జాత్యహంకా రానికీ, జాతి హత్యాకాండకు వీర మద్దతు దారులుగా తయారయ్యారు. కానీ డిక్లరేషన్‌ ‌సార్వభౌమిక పాలస్తీనా రాజ్యం కోసం తీర్మానించడం ద్వారా రెండు రాజ్యాల పరిష్కారం ప్రతిపాదించింది. పాలస్తీనియన్ల నిర్బంధ తొలగింపును గట్టిగా వ్యతిరేకిస్తూ గాజాలో భౌగోళిక జనాభా మార్పులను తిరస్కరించింది.

పాలస్తీనా స్వపరిపాలనా సంస్థ కింద ఏకీకృతం కావలసిన భూభాగంలో అవిభాజ్య భాగంగా గాజాను పరిగణించింది. బేషరతుగా కాల్పుల విరమణ, ఇజ్రాయిల్‌ ఉపసం హరణ, బందీల విడుదల జరగాలని డిమాండ్‌ ‌చేసింది. నిరాటంకంగా సహాయం పంపిణీ కావాలని కోరింది.ఆకలి మంటలతో మాడ్చి చంపడాన్ని ఆయుధంగా వాడుకోవడాన్ని ఖండించింది. మోడీ ఆధ్వర్యంలో ఇలా జరగడం అంధ భక్తులకు దిగ్భాంతికరంగా మారింది. అమెరికా, ఇజ్రాయిల్‌‌లు ఇరాన్‌‌పై అమానుషమైన దురాక్ర మణకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇది మరింత తీవ్రంగా దెబ్బతీసింది. ఎందుకంటే ప్రధాని మోడీ టెల్‌ అవీవ్‌‌లో ప్రత్యక్షమై ఒక భావన కలిగించారు. ఆ దౌత్యపరమైన తప్పు వ్యూహాన్ని ఈ విధంగా చక్కదిద్దుకునే ప్రయత్నమన్న మాట.

అమానుషమైన జాతి హత్యాకాండ
ఈనాటి ప్రపంచంలో భౌగోళిక, ఆర్థిక, రాజకీయాలు, ఆర్థికాంశాలు కూడా బహుళ ధృవ సంకేతాలివ్వడం పెరుగుతున్నది. గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టినట్టు దౌత్యనీతిలో అన్నిటా అమెరికా సామ్రాజ్యవాదంతోనే బ్రహ్మ ముడి వేసుకోవడం నిలిచేది కాదు. గాజాలో జరుగుతున్నది యూదు జాత్యహంకార జాతి నిర్మూలన హత్యాకాండ అనడంలో ఎలాంటి అపోహలూ వుండటానికి ఆస్కారం లేదు. పాలస్తీనా అధికారులు, అలాగే ఐక్యరాజ్యసమితి సంస్థలూ ఇచ్చిన అధికార పూర్వకమైన వివరాల ప్రకారమే గత మూడేండ్లలో ఆ భూఖండంలో 75వేల మందికి పైగా పాలస్తీనియన్లు బలయ్యారు. ఇందులో నలభై శాతం మందికి పైగా మహిళలు, పిల్లలూ వున్నారు. ఇలా ప్రాణాలు కోల్పోయిన వారుగాక మరో లక్షా71 వేల మంది గాయాలపాలైనారు. మరెన్నో వేల మంది జాడ తెలియని స్థితి వుంది. వారిలో అత్యధిక భాగం ప్రాణాలు కోల్పోవడమో శిథిలాల కింద నలిగిపోవడమో జరిగివుం టుందని కూడా భావిస్తున్నారు. ఇక ఆరోగ్యపరమైన సంక్షోభ పరిస్థితుల కారణంగా పరోక్షంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరెన్నో రెట్లు వుంటుంది. చికిత్సతో పోయే వ్యాధులు, వైద్య సంరక్షణ, సరైన తిండి లేక సంభవించే మరణాలవి. వెస్ట్ బ్యాంక్ లో పరిస్థితి కూడా చాలా ప్రమాద కరంగా, కుప్పకూలడానికి సిద్ధంగా వుంది. ఇక ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ విషయంలోనైతే వలసదారుల హింస తీవ్ర స్థాయికి చేరింది.

కఠోరమైన సైనిక ఆంక్షలు, తొలగింపుల హెచ్చరికలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా యూదు జాత్యహంకార ఇజ్రాయిల్‌, దాని ‌నరహంతక ఐ.డి.ఎఫ్‌ అంతర్జాతీయ ఒప్పందాలను, భద్రతామండలి తీర్మానాలను ఘోరంగా ఉల్లంఘిం చడం వల్లనే ఈ అమానవీయ కృత్యాలన్నీ సాగిపోతున్నాయనడంలో సందేహమే లేదు. చట్ట విరుద్ధమైన ఈ జాతి నిర్మూలన చర్యలను అమెరికా సామ్రాజ్యవాదం, మరీ ముఖ్యంగా ట్రంప్‌ ‌పాలనా వ్యవస్థ మద్దతునిస్తూనే వున్నాయని మళ్లీ చెప్పనవ సరం లేదు. ఇరాన్‌‌పై సంయుక్త దురాక్రమణ, పశ్చిమాసియాలో ప్రాంతీయ సంఘర్షణ, హర్మూజ్‌ ‌జలసంధి ద్వారా రాకపోకల నిలిపివేత, ఇరాన్‌ ‌ప్రతిఘటన అందువల్లనే. ఇవి పాలస్తీనా సమస్యను మరోసారి అంతర్జాతీయ రాజకీయాల కేంద్ర బిందువుగా నిలిపాయి. పాలస్తీనా పరిస్థితికి ప్రతిస్పందనగా యూరప్‌‌ లోనూ అమెరికా లోనూ కూడా వేలాది సంఘీభావ ఉద్యమాలు ప్రభవించడానికి ప్రేరణ కలిగింది. అమెరికా ఎన్నికల ప్రక్రియలో పాలస్తీనా సమస్య ఒక కీలకాం శంగా మారింది. ఇజ్రాయిల్‌‌కు వ్యతిరేకంగా అపూర్వమైన రీతిలో వలస ప్రజల సమీకరణ జరిగింది. ఈ కారణంగా యూ‌రపు ‌దేశాలలో గతంలో ఇజ్రాయిల్‌‌ను బలపరచ్చే అనేక ప్రభుత్వాలు దానికి దూరమైనాయి.

స్వదేశంలోనే నిరసన
పాలస్తీనాకు ఆ ప్రజల హక్కులకు సంబంధించి ఢిల్లీ డిక్లరేషన్‌ ‌నేపథ్యం ఇది. తన అంధ భక్త బృంద రాజకీయాలనూ, దౌత్యనీతిని మోడీ ప్రోత్సహించినదాని విషాద ఫలితమిది. ఇజ్రాయిల్‌ ఏకపక్ష చర్యలు పాలస్తీనా ముస్లింలను శిక్షించేం దుకుగల సహజమైన హక్కుగా చూసే పాక్షిక దృష్టి చరిత్రకే పూర్తి విరుద్ధమైన విషయం. మన విదేశాంగ విధానం సామ్రాజ్యవాద వ్యతిరేక వారసత్వాన్ని, జాతీయ ప్రయోజనాలను పరిత్యజించి అమెరికా ఆధిపత్య పెత్తనాలకు పూర్తిగా లొంగిపోవడమే. ఇజ్రాయిల్‌‌కు ఇంతగా అంటకాగడం అంతకంతకూ చెల్లుబాటుగాని సంక్షోభం గా తయారవుతున్నది. ఆ దేశం లోపల పెరుగుతున్న ప్రజాభిప్రాయమే ఇందుకు భిన్నంగా వుంది. గత ఏడాది ఆస్కార్‌ అవార్డు పొందిన ఇజ్రాయిల్‌ ‌చలనచిత్రకారులు యువల్‌ అబ్రహం, రాచెల్ స్జోర్ లు నిర్మించిన ఎనభై నిముషాల డాక్యుమెంటరీ ‘నాజా’ వెనిజులా చిత్రోత్సవంలో గొప్ప ప్రశంసలు అందుకుంది. గాజాపై జాతి నిర్మూలన యుద్ధకాండలో పాలస్తీనా పౌర జనాభాపై ఇజ్రాయిల్‌ సాగించిన సామూహిక హత్యాకాండ ఆసుపాసులేమిటో దాంట్లో వివరంగా పొందుపరిచారు.

లక్ష్యంగా నిర్దేశించుకున్న ఒక మనిషిని అంతం చేయడం కోసం 500 మంది వరకూ ప్రజానీకం ప్రాణాలు తీయడానికి అనుమతి వుంటుందని అందులోని ఇంటర్వ్యూలో ఒకడు చెప్పాడు. ఐ.డి.ఎఫ్‌ అధికార ప్రతినిధి దీన్ని ఖండించం ఊహించదగిందే. అయితే ఇజ్రాయిల్‌ సాంస్కృతిక శాఖామంత్రి మికీ జోహార్‌ ఆ చిత్ర నిర్మాతల ఇజ్రాయిల్‌ పౌరసత్వాన్ని రద్దు చేయవలసిందిగా దేశీయ మంత్రిత్వ శాఖను కోరారు. గత ఏడాది ఆస్కార్‌ ‌పొందిన ఈ చిత్రకారులు వెస్ట్ బ్యాంక్ లో పాలస్తీనియన్లపై యూదు జాత్యహంకార వలసదారుల హింస చరిత్రను ‌చిత్రీకరించేందుకు ‘ఇంకెక్కడికి పోతాం’ పేర ఇప్పుడు మరో డాక్యుమెంటరీని తలపెట్టారు.ఇజ్రాయిల్‌ నుంచే వినిపిస్తున్న ఈ ప్రత్యామ్నాయ స్వరాలు, నెతన్యాహూ ఆయన హంగుదారులు ఇనుప చేతులతో వాటిని అణిచివేసేందుకు కంగారుపడుతున్న తీరు చూస్తే వారి ఫాసిస్టు మనస్తత్వం కళ్లకు కడుతుంది. కనుక మోడీ అంధ భక్తులకూ వీరికి మధ్యన ఉమ్మడి బంధమేమిటో అర్థం చేసుకోవడం మనకేమీ కష్టం కాదు. వచ్చే ఏడాది కోల్‌కతాలో జరిగే అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనకు ఇజ్రాయిల్‌‌నే ప్రేరణ దేశంగా బెంగాల్‌‌ కొత్త ప్రభుత్వం ఉరుకులు పరుగులతో దుస్సాహస నిర్ణయం తీసేసుకుంది.

కళ్లు తెరుస్తారా?
పాలస్తీనాలోనూ ఆ చుట్టూ వున్న పరిస్థితులపై బ్రిక్స్‌ శిఖరాగ్రసభ ఢిల్లీ డిక్లరేషన్‌ ‌పొందుపర్చిన పరిణామాల రీత్యా అంధ భక్తులకు కొంతైనా హేతుబద్దత కలిగి వాస్తవ స్పృహ పునరుద్ధరణ జరుగుతుందో లేదో తెలియదు. ఇదివరలో బీజేపీ ఐ.టి విభాగం గూండాలు బహిరంగంగానే ఇజ్రాయిల్‌ జాతి హత్యాకాండను ముందుకు నెడుతూ వచ్చారు. పాలస్తీనియన్లను తుడిచిపెట్టాలనే యూదు దురహంకార పిలుపులనే మోత మోగించారు. దిమాగీ నక్సల్‌ అనేది గైర్‌ దిమాగీ అంధ‌ భక్తులకు విరుగుడు వంటిదేనన్న స్పృహ వారికి మళ్లీ కలగడానికి ఢిల్లీ డిక్లరేషన్‌ ‌కొంతైనా ఉపయోగపడితే మంచిదనుకోవాలి. ఆ విధమైన మేధో పతనం కారణంగా… భారతదేశం వంటి ప్రాచీన నాగరికతను భూతంగా చిత్రీకరించడాన్ని… విజ్ఞతాయుతమైన పౌర ధర్మమేదీ అంగీకరించదు.
(సెప్టెంబర్‌ 16-‘పీపుల్స్‌ ‌డెమోక్రసీ’
సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -