Saturday, September 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం9.56 లక్షల ఇండ్లు కేటాయించండి

9.56 లక్షల ఇండ్లు కేటాయించండి

- Advertisement -

కేంద్ర మంత్రి శివరాజ్‌‌సింగ్‌ ‌చౌహాన్‌‌తో సీఎం రేవంత్‌‌రెడ్డి భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర మంత్రి శివరాజ్‌‌సింగ్‌ ‌చౌహాన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి భేటీ అయ్యారు. పీఎంఏవైజీ పథకం కింద మొదటి విడతగా రాష్ట్రానికి రెండు లక్షల ఇండ్లను కేటాయించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మరో 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని మాదాపూర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలంటూ జూలైలో కేంద్రమంత్రికి చేసిన విజ్ఞప్తిని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎల్‌‌నివో ప్రభావంపై కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్‌ వినియోగం పెరిగిందని తెలిపారు. ఎల్‌‌నివో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో ఎల్‌‌నివో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -