అమెరికాకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన లక్షలాది మంది ప్రజలు
ఇరాన్ రక్షణ కోసం నిరసన
దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం : ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్
టెహ్రాన్ : పశ్చిమాసియాలో యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా.. దుందుడుకు చర్యలు మాత్రం ఆగడం లేదంటూ అమెరికా తీరుపై ఇరాన్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతు న్నాయి. దేశ ఐక్యతను ప్రతిబింబించేలా ప్రభుత్వ సూచన మేరకు శుక్రవారం టెహ్రాన్‌లో లక్షలాది మంది ఇరాన్ పౌరులు రోడ్లపైకి వచ్చారు. ‘జాన్-ఫాదా’ అనే నినాదం (తమ ప్రాణాలను త్యాగం చేసేవారు)తో జాతీయ పతాకాన్ని చేతబట్టి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశం కోసం తాము ఆయుధాలు పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిజ్ఞ చేశారు. అమెరికా, ఇజ్రాయిల్ నాశనమవ్వాలంటూ నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుల చిత్రాలు ఉన్న శవపేటికలను ప్రదర్శించారు. వారిద్దరి చిత్రపటాలపై కాళ్లతో తొక్కుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధం సహా పలు ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు. అయితే ఇరాన్లో యుద్ధం మొదలైన తర్వాత చేపట్టిన అతి పెద్ద ర్యాలీ ఇదే. ఇరాన్-ఇరాక్ యుద్ధాన్ని స్మరించుకోవడానికి, ఎనిమిదేండ్ల సంఘర్షణలో సేవ చేసి, మరణించిన వారిని గౌరవించుకోవడానికి ఇరాన్లో ప్రతి ఏటా సెప్టెంబర్ 22న ఈ వారోత్సవాలు నిర్వహిస్తారు. దీంతోపాటు 2026 ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా నగరాల్లోని ప్రజలు దేశానికి , దాడులకు వ్యతిరేకంగా తమ ప్రతిఘటనకు తమ మద్దతును తెలియజేయడానికి ప్రతి రాత్రి వీధుల్లోకి వస్తున్నారు. దీంతో ఇది 200వ ప్రతిఘటన.
టెహ్రాన్‌లో జరిగిన సైనిక కవాతులో ఇరాన్ మిలీషియా దళాల (బసిజ్) మహిళా సభ్యులు పాల్గొన్నారు. అపరిమిత సైనిక శిక్షణ తీసుకొని, దేశ రక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువత.. సైనిక దుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. వీళ్లంతా పారామిలిటరీ రివల్యూ షనరీ గార్డ్స్‌కు అదనపు లేయర్‌గా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించనున్నారు. అమెరికా చర్యల నేపథ్యంలో తన బలాన్ని చాటుకునేందుకు ఇరాన్ ప్రభుత్వం ఈ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు 6 లక్షల మందికిపైగా రిజిస్టర్ చేసుకోగా.. దాదాపు 10 లక్షల మందికి పైనే పాల్గొన్నారని టెహ్రాన్ గార్డ్ చీఫ్ జనరల్ హసన్ వెల్లడించారు.
మా జీవితాలు ఇరాన్‌కు అంకితం అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్
“మా జీవితాలు ప్రజలకు, దేశానికి అంకి తం. మేం మా పూర్తి శక్తితో పని చేస్తున్నాం. దేశానికి ఇది చాలా కీలకం’’ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ…బాహ్య ఒత్తిడిని ఎదుర్కో వడంలో జాతీయ ఐక్యత పాత్రను నొక్కి చెప్పారు. ప్రజల శక్తి ప్రదర్శన ఇరాన్ ప్రత్యర్థుల మనోధైర్యం, ఐక్యత, సమన్వ యం చూసి శత్రువును నిరుత్సాహపరు స్తాయని చెప్పారు. హార్ముజ్ జలసంధితో సహా తన వ్యూహా త్మక ప్రాంతాలను రక్షించుకోవాలనే ఇరాన్ సంకల్పాన్ని ఆయన నొక్కిచెప్పారు. తమ వ్యూహాత్మక రక్షణ రేఖలను కాపాడు కోవడానికి దేశం ప్రజల శక్తిపై ఆధారపడు తుందని చెప్పారు. అమెరికా బలగాలు చివరికి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టక తప్పదని తయేబ్ జోస్యం చెప్పారు.
టెహ్రాన్‌లో భారీ ప్రదర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



