వచ్చే వారం లేహ్‌లో ప్రారంభం
లేహ్: గత ఏడాది సెప్టెంబర్‌లో లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం పర్యావరణ కార్యకర్త వాంగ్ చుక్ నేతృత్వంలో విద్యార్థులు సాగించిన ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నలుగురు సాధారణ పౌరులు మరణించగా, అనేక మందికి గాయాలయ్యాయి. నిరాహార దీక్షలో ఉన్న వాంగ్చుక్పై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఎ) కింద కేసు నమోదు చేసి, ఆరు నెలల పాటు జోధ్‌పూర్ జైలులో నిర్బంధించారు. అయితే, ఈ ఉద్యమ మొదటి వార్షికోత్సవం సందర్భంగా, సోనమ్ వాంగ్‌చుక్ వచ్చే వారం లేహ్‌లో 20 కిలోమీటర్ల పాదయాత్రను ప్రకటించారు.
కార్గిల్ నుంచి లేహ్‌కు యాత్ర..
ఈ పాదయాత్రను మొదట కార్గిల్ నుంచి ప్రారంభించి, లేహ్‌లో ముగించాలని ప్రణాళిక వేశారు. అయితే, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, దీన్ని 20 కిలోమీటర్ల ‘సంకేత’ యాత్రగా కుదించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ యాత్ర ప్రణాళికను వెల్లడించిన వాంగ్‌చుక్, లడఖ్ సంస్కృతి, పర్యావరణం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ యాత్ర చేపట్టానని తెలిపారు. వచ్చేవారం 23న లేహ్‌లో సంకేత పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. లడఖ్ పర్యావరణం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన అమరుల జ్ఞాపకార్థం ఈ నెల 24న ‘అమరవీరుల దినోత్సవం’ (షహీద్ దివస్)గా పాటించనున్నట్లు ఆయన తెలిపారు. వార్షికోత్సవానికి ముందు, గత ఏడాది పోలీసు కాల్పుల్లో మరణించిన నలుగురు వ్యక్తుల కుటుంబాలకు లడఖ్ కేంద్రపాలిత ప్రాంత పరిపాలన ఆదివారం పరిహారం ప్రకటించింది. ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఈ పరిహారాన్ని ప్రభుత్వం సంవత్సరం తరువాత నెరవేర్చడం గమనార్హం.
పాదయాత్ర కువాంగ్చుక్ సన్నద్ధం
- Advertisement -
- Advertisement -



