కాటాపూర్ రామాలయం లో ఘనంగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం

– సందర్శకులకు ఎన్ ఆర్ ఐ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

నవతెలంగాణ- తాడ్వాయి : మండలంలోని కాటాపూర్లో సోమవారం బాల రాముని ప్రాణ ప్రతిష్ట(వేడుకలు) కార్యక్రమం ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ పులి నరసయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వారందరూ ఉదయాన్నే లేచి రంగురంగుల ముగ్గులతో అలంకరించి, తలంటు స్థానాల ఆచరించి, మామిడాకు తోరణాలతో ఇళ్లను అలంకరించుకున్నారు. రామాలయానికి చేరుకొని హోమం నిర్వహించి పటాసులు పేల్చి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఎన్ఆర్ఐ పులి రవి గౌడ్- మమత, వారి ఆర్థిక సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వారందరూ పరిసర గ్రామాల ప్రజలందరూ మహా అన్నదాన కార్యక్రమం పాల్గొని భోజనాలు ఆరగించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ పులి నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి మానసికంగా ఉల్లాసంగా ఎదగాలంటే ఆధ్యాత్మిక చింతన అవసరమని అన్నారు. ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే వ్యక్తి మానసిక ఉల్లాసానికి అన్ని రంగాల్లో ఎదుగుతాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌరమ్మ, వివిధ కుల సంఘాల పెద్దలు, యూత్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love