నవతెలంగాణ-మల్హర్ రావు
ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై కందుల మల్లయ్య (52) అనే రైతు మృతిచెందిన సంఘటన మండల కేంద్రమైన తాడిచర్లలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల,స్థానికుల పూర్తి కథనం మేరకు మల్లయ్య శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుంటున్న సమయంలో పాము కాటు వేయడంతో స్థానిక రైతులతో కలిసి తాడిచెర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు భూపాలపల్లి జిల్లా వందపడకల ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి మృతి చెందినట్లుగా తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కొయ్యుర్ పోలీసులు తెలిపారు.
పాముకాటుతో రైతు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



