Sunday, September 20, 2026
E-PAPER
Homeజిల్లాలుమిడ్జిల్‌లో రూ. 1.51 లక్షలు పలికిన గణేశుడి లడ్డు  

మిడ్జిల్‌లో రూ. 1.51 లక్షలు పలికిన గణేశుడి లడ్డు  

- Advertisement -

లడ్డును దక్కించుకున్న స్వచ్ఛంద సేవకులు జరుపుల రోజా భాస్కర్ నాయక్
నవతెలంగాణ-మిడ్జిల్ 

మిడ్జిల్ మండల కేంద్రంలో వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక చవితి వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణనాథుని లడ్డు వేలం పాట పోటాపోటీగా సాగింది. వినాయకుడి లడ్డును దక్కించుకోవడానికి భక్తులు ఎంతో ఉత్సాహం చూపించారు. చివరికి ఈ లడ్డును ప్రముఖ స్వచ్ఛంద సేవకులు జర్పుల రోజా – భాస్కర్ నాయక్ దంపతులు రికార్డు స్థాయిలో రూ. 1,51,000 (లక్షా యాభై ఒక్క వేల రూపాయల)కు దక్కించుకున్నారు. దంపతులకు లడ్డుతో పాటు వెండి వినాయకుని విగ్రహాన్ని నిర్వాహకులు అందజేశారు. 

అనంతరం రోజా భాస్కర్ నాయక్ మాట్లాడుతూ.. స్వామివారి కృప కోసమే తాము ఈ వేలంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోజా – భాస్కర్ నాయక్ దంపతులను ఉత్సవ కమిటీ సభ్యులు, వ్యాపార సంఘం ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డప్పు వాయిద్యాలతోటి, గణపతి నినాదాలతోటి రోజా భాస్కర్ నాయక్ దంపతుల ఇంటికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్, మాజీ జెడ్పిటిసి సభ్యులు హైమావతి బాల్ రెడ్డి, విగ్రహ ఉత్సాహ కమిటీ అధ్యక్షులు బరిగెల శ్రీనివాసులు, వ్యాపార సంఘం అధ్యక్షులు గంజి కృష్ణ, వ్యాపార సంఘం సభ్యులు రాజేశ్వర్, పల్లె తిరుపతి, శ్రీనివాసులు గుప్తా, విజయ్ గుప్తా, గంజి శేఖర్, ఏదుల కృష్ణ, మామిడి మాడ శంకరు ,శ్రీనివాసులు, అశోక్, నామిని శంకర్, రవీందర్, పుర్రు  నరసింహ, భాస్కరాచారి,  మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -