Tuesday, September 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుచెరుకు పంటకు చెదలు

చెరుకు పంటకు చెదలు

- Advertisement -

వేరు పురుగుతో తీవ్ర నష్టం
దిగుబడులపై 
ఎల్‌‌నినో ప్రభావం
సాధారణంగా ఎకరాకు 
60 టన్నుల దిగుబడి
అనావృష్టి, తెగుళ్లతో 
20 టన్నులకు మించని వైనం
కేంద్ర ప్రభుత్వ విధానాలతో మరింత నష్టం

నవతెలంగాణ- మహబూబ్‌నగర్ 
ప్రాంతీయ ప్రతినిది
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో చెరుకు పంటపై తీవ్ర ప్రభావం పడింది. సగానికి పైగా సాగు తగ్గడమే కాక.. వేసిన పంట వేరుపురుగు వల్ల పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు. ఒక వైపు ప్రకృతి వైపరిత్యాలు.. మరో వైపు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వక పోవడం వలన పాలమూరు రైతాంగం చెరుకు సాగుపై మక్కువ చూపడం లేదు. ఎల్‌నినో ప్రభావం నేపత్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులు నష్టాల బారిన పడకుండా ఆర్థికంగా ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో ఒకప్పుడు ఐదు లక్షల ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గింది. కొంత కాలం నుంచి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా 59,275 ఎకరాల్లో చెరుకు పంట సాగయ్యేది. ఈ సారి కేవలం 25 వేల ఎకరాలకు మించలేదు. వనపర్తి జిల్లాలో 5600 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం కాగా ఈ ఏడాది కేవలం 1500 ఎకరాల్లోనే సాగైంది. గద్వాల జిల్లాలో 3460 ఎకరాలకుగాను 1120 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 2 వేల ఎకరాలకు 500 ఎకరాలు మాత్రమే సాగయ్యింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అమరచింత, ఆత్మకూరు, మదనాపూర్, పెబ్బేరు తధితర ప్రాంతాలలోనే 10 వేల ఎకరాలు సాగయ్యేది. వర్షాలు లేక జూరాలలో నీటి కొరత వల్ల అనేక మంది రైతులు చెరుకు సాగుకు దూరమయ్యారు. కొందరు సాగు చేసినా… వర్షాబావం వల్ల దిగుబడి వచ్చే పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​తగ్గనున్న దిగుబడి
తెగుళ్లు, నీటి ఎద్దడి వలన చెరుకు దిగుబడులు భారీగా పడిపోయే అవకాశా లున్నాయి. ఆశాజ నకంగా పంట రావాలంటే నీటి లభ్యత అధికంగా ఉండాలి. నీటి లభ్యత సంవృద్ధిగా ఉంటేనే చెరుకు కాడలు ఏపుగా పెరిగి తూకం బాగా వస్తుంది. సాధారణంగా ఎకరాకు 60 టన్నుల దిగుబడి వస్తది. అనావృష్టి, తెగుళ్లతో ఈ సారి 20 టన్ను లకు మించదని రైతులు ఆందోళన చెందు తున్నా రు. ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరతతో చెరుకు గడలకు రసం లేకుండా పోతుం ది. దీంతో తూకం తగ్గడమే కాక కంపెనీలు గిట్టు బాటు ధర ఇవ్వడానికి ససేమిరా అంటాయి. చెరుకు రసంలో నాణ్యతా ప్రమాణాలను బట్టి కంపెనీలు ధరలు చెల్లిస్తాయి.

గిట్టుబాటు ధర లేక నష్టం
కేంద్ర ప్రభుత్వం చెరుకు పంటకు గిట్టుబాటు ధర కల్పంచడంలో వైఫల్యం చెందుతున్నది. ప్రతి ఏటా ధరలు పెంచాలని రైతులు ఆందోళన చేసినా పాలకులకు పట్టడం లేదు. ప్రస్తుతం క్వింటాల్‌ ‌ధర రూ.3810కు బోనస్ 350 కలిపి రూ.4160 ఇస్తు న్నారు. కేంద్రం గిట్టుబాటు ధర రూ. 6000తో పాటు రూ.వెయ్యి రూపాయలు బోనస్‌ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.500లు బోనస్ ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

​పెరుగుతున్న పెట్టుబడులు
క్వింటాల్‌ ‌మేలు రకం చెరుకు విత్తనాల ధర రూ. 20 వేల వరకు ఉంటుంది. సాగుకు రసాయన ఎరువల వాడకం ఇటీవల పెరిగింది. కూలీలు ఎకరాకు రూ. 8 నుండి 10 వేలు అడుగు తున్నారు. దీంతో పెట్టుబడి రెట్టింపు అవు తుంది. ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌ జిల్లాలో కొత్త కోటలో కృష్ణవేణి షుగర్‌ ‌ఫ్యాక్టరీ మాత్రమే ఉన్నది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అందుకే రైతులు చెరుకుకు బదులు వరి, వేరుశ నగ, పత్తి వంటి పంటల వైపు మొగ్గుచూప్తున్నారు.

​పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి

చెరుకు పంట సాగు చేయడం మిగితా పంటల మాదిరిగా సులభమైనదికాదు. ఎక్కువగా శ్రమ పడాలి. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌‌కు రూ. 6వేలు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలు బోనస్ కింద రూ. 500, 1000 చెల్లించాలి. ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన రైతుల పరిహారం చెల్లించి ఆదుకోవాలి.

​పంటల సాగుపై రైతులకు అవగహన కల్పించాలి
రాజు, చెరుకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వనపర్తి,

​పంటల సాగుపై రైతులకు అవగహన కల్పించాలి. జిల్లాలో అతికష్టం మీద చెరుకు సాగు చేసే రైతులకు ఆధనిక యంత్ర సామాగ్రిని అందుబాటులో ఉంచి నష్టాలు రాకుండా చూడాలి. ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే చెరుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.

​వేరుపురుగుతో ఇక్కట్లు
చెరుకు పంట కావాల్సిన నీటి తడులు పెట్టకపోతే వేరు పురుగు ఆశిస్తోంది. ఈసారి వర్షాభావం వలన నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో ఎన్నడూ లేని విదంగా వేరు పురుగు తొలచి చెట్లు ఎండి పోతున్నాయి. చెట్ల కాండంను పురుగు తొలుస్తోంది. చెట్లు ఎర్రబారి ఎండుతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. నీటి తడులు పెట్టేందుకు అవసరమైన వనరుల్లేకపోవడంతో పంటకు తెగుళ్లు సోకుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -