గీతం మహిళా సాధికారిత
సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు
వ్యవస్థాపకత, స్టార్టప్ లపై అవగాహన
నవతెలంగాణ-పటాన్చెరు
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థినులు బుధవారం వీ హబ్ (డబ్ల్యూఈ హబ్)) సందర్శించారు. గీతం మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పారిశ్రామిక సందర్శన ద్వారా విద్యార్థులకు వ్యవస్థాపకత, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థపై విలువైన అవగాహన కల్పించారు. మహిళా సాధికారత సెల్ ఛైర్ పర్సన్ ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ పర్యవేక్షణలో, సుమారు 40 మంది విద్యార్థినులు, ఐదుగురు మహిళా అధ్యాపకులు ఈ సందర్శనలో పాల్గొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం భారతదేశపు మొట్టమొదటి రాష్ట్ర-ఆధారిత నోడల్ సంస్థ అయిన వీ హబ్, విద్యార్థులకు ఆవిష్కరణ, వ్యాపార సృష్టి, మార్గదర్శకత్వం, నెట్ వర్కింగ్, పారిశ్రామిక మద్దతుపై అవగాహన కల్పించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను వాస్తవ ప్రపంచ పారిశ్రామిక పద్ధతులతో అనుసంధానించుకోవడంతో పాటు, మహిళా నేతత్వంలోని వ్యవస్థాపకత, నాయకత్వం, సృజనాత్మకత, సమస్య-పరిష్కారంపై అవగాహన పొందారు. ఈ సందర్శనలో సీఎస్ఎస్ఈ విభాగం నుంచి జ్యోతి బంకాపల్లి, డాక్టర్ అపర్ణ, ఆర్కిటెక్చర్ విభాగం నుంచి డాక్టర్ సౌపూర్ణి పాల్, మనస్తత్వశాస్త్ర విభాగం నుంచి డాక్టర్ దుర్గేష్ నందిని తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
వీ హబ్‌ను సందర్శించిన గీతం విద్యార్థినులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



