రెండు వారాలు రైతుల పక్షాన ఉద్యమించాం : జిల్లా నాయకులు
నవతెలంగాణ -ఆత్మకూరు
సీపీఐ(ఎం) పోరాట ఫలితంగా ప్రభుత్వం జూరాల నుంచి సాగునీరు విడుదల చేసిందని సీపీఐ(ఎం) నాయ కులు అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా అమరచింత లోని జీఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీఎస్ గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఎస్. రాజు, బి. వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు వై. అజయ్, సీనియర్ నాయకులు బుచ్చన్న, శ్యామ్ సుందర్ మాట్లా డారు. రెండు వారాలుగా జూరాల ప్రాజెక్టు నుంచి పంటలకు సాగు నీటిని విడుదల చేయాలని రైతులు, సీపీఐ(ఎం) కలిసి పోరాటం చేశామ న్నారు. రైతుల పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతుగా ఆందోళనలు నిర్వహించడం వలనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి జూరాల నుంచి బుధవారం నీళ్లు విడుదల చేసిందన్నారు. సాగునీరు విడుదల పట్ల సీపీఐ(ఎం) పార్టీగా హర్షం వ్యక్తం చేశారు..కర్నాటక ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో ఆల్మట్టి డ్యాం నుంచి జూరాల డ్యాంకు ఎన్ని టీఎంసీల నీరు విడుదల చేయాలని అడుగుతున్నారనే దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో రైతు బీమా కోసం ప్రభుత్వం ఎల్‌ఐసీకి ప్రీమియం కట్టకపోవడంతో రైతు బీమా అమలవుతుందా లేదా అనే ఆందోళనలో రైతు కుటుంబాలు ఉన్నాయన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి నిరంజన్ రెడ్డి జూరాల నుంచి నీళ్లు తరలించుకు పోయారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా డ్యాం పక్కన ఉన్న గ్రామాలకు నీళ్లు వదలకుండా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నా రని బీఆర్‌ఎస్ వాళ్లు ఆందోళన చేశారని గుర్తుచేశారు. స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి చొరవ తీసుకొని డ్యాం పరిసర ప్రాంతాల్లోని చెరువులు, రిజర్వాయర్లను జూరాల నీటితో నింపాలని డిమాండ్ చేశారు. పొట్టదశలో ఉన్న పైర్లకు నీటి విడుదల ఎంతో ఉపయోగమన్నారు. రైతాంగాన్ని కాపాడుకుంటేనే దేశంలో ఆహార కొరత తీరుతుందన్నారు. పాలమూరు రైతాంగానికి ఏ సమస్య వచ్చినా సీపీఐ(ఎం) అండగా ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు.
సీపీఐ(ఎం) పోరాట ఫలితమే జూరాల సాగునీరు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



