Homeతెలంగాణ రౌండప్ప్రమాదకర విద్యుత్ వైర్లను వెంటనే తొలగించాలి

ప్రమాదకర విద్యుత్ వైర్లను వెంటనే తొలగించాలి

- Advertisement -

నవతెలంగాణ – నాచారం
నాచారం ప్రధాన రహదారిపై జాన్సన్ గ్రామర్ స్కూల్‌కు వెళ్లే మలుపు వద్ద, రాఘవేంద్ర నగర్ కాలనీలోని కేజేఎన్ రెడ్డి భవనం మొదటి అంతస్తు బాల్కనీకి అత్యంత సమీపంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వైర్లు వలన భవన నివాసితులతో పాటు రహదారిపై ప్రయాణించే ప్రజలకు సైతం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, సమస్యను పరిష్కరించాలని గత ఐదు నెలలుగా నాచారం ఎలక్ట్రికల్ ఏఈ నాగరాజుకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

విద్యుత్ వైర్లకు సేఫ్టీ పైపులు ఏర్పాటు చేయడం లేదా అవసరమైతే వైర్లను సురక్షిత దూరానికి మార్చేందుకు సపోర్టులు ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరినట్లు తెలిపారు. ప్రతిసారి త్వరలో పనులు చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పుడే జాగ్రత్త పడాలని కోరారు. లేనియెడల ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విట్టల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -