Homeఖమ్మంవర్షంలోనూ ఘనంగా 'గణేష్' నిమజ్జనాలు

వర్షంలోనూ ఘనంగా ‘గణేష్’ నిమజ్జనాలు

- Advertisement -

– పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి 

భారీ వర్షం, తుఫానును సైతం లెక్కచేయకుండా సత్తుపల్లి మున్సిపాలిటీలో గణేష్ నవరాత్రి వేడుకలు, నిమజ్జన ఊరేగింపులు అత్యంత వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పట్టణంలోని వివిధ వార్డులు, కాలనీల్లోని మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ​జేవీఆర్ పార్క్, హనుమాన్ నగర్, ఎన్టీఆర్ కాలనీ, బైపాస్ రోడ్డు, వేంసూరు రోడ్డులోని షాదీ ఖానా ప్రాంగణం, నేతాజీ రోడ్డులోని గణపతి మండపాల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.  అనంతరం భక్తులతో కలిసి గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌ పర్సన్ రెహానా కమల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, నాయకులు కమల్ పాషా, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు బొంతు వేణు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొని ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -