Homeఆదిలాబాద్వృద్ధురాలి హత్య కేసు చేదించిన పోలీసులు 

వృద్ధురాలి హత్య కేసు చేదించిన పోలీసులు 

- Advertisement -

నవతెలంగాణ-ఆసిఫాబాద్ 
మండలంలోని బూరుగుడ గ్రామంలో ఆగస్టు 30వ తేదీన జరిగిన వృద్ధురాలు మేకర్తి మల్లక్క (80) హత్య కేసును జిల్లా పోలీసులు చేదించారు. జిల్లా ఎస్పీ నీతిక పంత్, డి.ఎస్.పి అశోక్, సిఐ నీలం రవితో కలిసి డిపిఓ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మద్యానికి బానిసైనా ధనుంజయ్ వృద్ధురాలు పైన ఉన్న బంగారంపై కన్నేశాడు. ఆగస్టు 30న వృద్ధురాలి ఇంట్లో చొరబడిన నిందితుడు మల్లక్క ను బండరాయితో కొట్టి  చెవి కమ్మలను దోచుకోవడంతో పాటు ఇంట్లో ఇతరవస్తుల కోసం వెతికాడు. ఏమి దొరకకపోవడంతో అక్కడి నుండి పారిపోయాడు. ఈనెల 21న వృద్ధురాలి ఇంటి నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి మల్లక్క మృతి చెంది ఉంది. దీంతో బంధువులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ధనుంజయ్ దొంగలించిన బంగారాన్ని అమ్మేందుకు ప్రవీణ్ సహాయంతో  మహేష్ కు 32  వేలకు విక్రయించాడు. దాంట్లో నుండి మూడు వేల రూపాయలను ప్రవీణ్ కమిషన్ తీసుకొని మిగతా 29 వేలను ధనంజయ్ కిచ్చాడు. వచ్చిన డబ్బులతో దుబారా ఖర్చు పెట్టుతుండడంతో పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. అనుమానం రావడంతో విచారణ చేపట్టగా హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో ధనుంజయతో పాటు అతనికి సహకరించిన ప్రవీణ్ బంగారం కొనుగోలు చేసిన మహేష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. కేసును చేదించిన సిబ్బంది ప్రేమ్ సింగ్, శేషారావుతోపాటు డిఎస్పి అశోక్, సిఐ నీలం రవిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుండి ఎలాంటి రసీదు లేకుండా బంగారం కానీ ఇతర వస్తువులు కొనుగోలు చేయవద్దని అలా చేసినట్లయితే నిందితులుగా మారాల్సి వస్తుందని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -