Homeతెలంగాణ రౌండప్ప్రణవికి గవర్నర్ చేతుల మీదుగా శ్రీరామ్ ఇన్సురెన్స్ ప్రతిభా పురస్కారం

ప్రణవికి గవర్నర్ చేతుల మీదుగా శ్రీరామ్ ఇన్సురెన్స్ ప్రతిభా పురస్కారం

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన మేనం ప్రణవికి విద్యార్థినికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతిభా పురస్కారం శుక్రవారం హైదరాబాద్ లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవి 2025-26 విద్యా సంవత్సరంలో తాడిచర్ల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి జిల్లా అత్యుత్తమ ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే .ఇందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీచే రూ. లక్షల నగదు బహుమతిని గవర్నర్ చే అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తాడిచర్ల హైస్కూల్  ప్రధానోపాధ్యాయుడు సి.హెచ్ తిరుపతి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ప్రణవిని అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి, శ్రీరామ్ ఇన్సూరెన్స్ వారిచే నగదు బహుమతి పొందాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -