Homeతెలంగాణ రౌండప్ట్రేడ్ లైసెన్సుల ఫీజులు చెల్లించని ప్రైవేట్ ఆస్పత్రులు 

ట్రేడ్ లైసెన్సుల ఫీజులు చెల్లించని ప్రైవేట్ ఆస్పత్రులు 

- Advertisement -

మున్సిపల్ ఆదాయానికి గండి..!
నవతెలంగాణ-అచ్చంపేట
మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారంగా పరిధిలోని వ్యాపార దుకాణాలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహణల నిమిత్తం మున్సిపాలిటీ నుంచి నిర్దేశించిన ఫీజు చెల్లించి ట్రేడ్ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది మళ్లీ ఫీజులు చెల్లించి రెన్యువల్ చేసుకోవాలి. కానీ అచ్చంపేట మున్సిపాలిటీలో ప్రైవేటు ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు  చేస్తున్నామని సాకు చూపిస్తూ.. మున్సిపాలిటీకి గత 10.ఏళ్ళు గా  ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం లేదు. ఫీజులు చెల్లించడం లేదు. మున్సిపాలిటీ సర్వీస్ సేవలు పొందుతున్నారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించకపోవడంతో మునిసిపాలిటీకి తీవ్రంగా నష్టం జరుగుతుంది.

రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు: పట్టణంలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు అనారోగ్యంతో హాస్పిటల్ కి వచ్చిన రోగులనుంచి ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం లేదు ఫీజులు వసూలు చేయడంలో మున్సిపల్ కమిషనర్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది: మురళి, మునిసిపల్  కమిషనర్, అచ్చంపేట
ప్రభుత్వ నిబంధనలు మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా వ్యాపార సంస్థలు మెజర్మెంట్ ప్రకారంగా వచ్చిన ఫీజు చెల్లించి  ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రుల ట్రేడ్ లైసెన్సుల విషయం కోర్టులో పెండింగ్ లో ఉంది. కోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే ఆసుపత్రులకు ట్రేడ్ లైసెన్సులు జారీ చేస్తాం. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -