నవతెలంగాణ-భీంగల్
భీంగల్ పట్టణంతోపాటు పురానిపేట్, పిప్రి, జాగిర్యాల్ వివిధ గ్రామలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పథకం ద్వారా 30,12, 7, 4, మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆరోగ్య చికిత్సలకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని గ్రామస్థులు తెలిపారు.
ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా 161 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.44,15/- లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పేద ప్రజలకు వైద్య ఖర్చుల విషయంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్న సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కావడానికి కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తోట శంకర్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.



