Homeఖమ్మంభారీ వర్షంతో సత్తుపల్లి సింగరేణి ఓసీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

భారీ వర్షంతో సత్తుపల్లి సింగరేణి ఓసీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి పరిధిలో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ (ఓసీ) గనుల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి తవ్వకం పనులు నిలిచిపోయాయి. జేవీఆర్, కిష్టారం ఓసీల్లోకి భారీగా వరద నీరు చేరడంతో పాటు అంతర్గత రహదారులు బురదమయంగా మారాయి. ​బొగ్గు రవాణా వాహనాలు, యంత్రాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో అధికారులు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ​గనుల ప్రాంతంలో సుమారు 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు.

​ఈ వర్షం కారణంగా గనుల్లో 1.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది. ​అదేవిధంగా 90 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ​గనుల్లోకి చేరిన నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు మోటార్లను ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. ​రహదారులను పునరుద్ధరించి, బురదను తొలగించే పనులను సిబ్బంది ముమ్మరం చేశారు. వర్షం తగ్గుముఖం పట్టి గనుల్లో నీరు ఖాళీ అయితే తప్ప పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదు. ​ప్రతికూల వాతావరణం వల్ల సింగరేణికి భారీగా బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -