Homeఆదిలాబాద్పంట అమ్ముకోవడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి 

పంట అమ్ముకోవడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి 

- Advertisement -

నవతెలంగాణ-ఆసిఫాబాద్ 
వచ్చే నెల నుండి దిగుబడి వచ్చి పత్తి తో పాటు ఇతర పంటలు అమ్ముకోవడానికి ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని వ్యవసాయ విస్తరణ అధికారి చిరంజీవి తెలిపారు. స్థానిక కార్యాలయంలో తిరుపతి, రాము, వెంకటేష్, స్రవంతి, హరీష్ లతో కలిసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలో ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రిజిస్టర్ అయి ఉండాలన్నారు. అలా ఉన్నప్పుడే పంట కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కానీ రైతు వద్ద నుండి పంట కొనుగోలు చేయడం జరగదని, అప్పుడు రైతులు ఇబ్బంది పడతారని తెలిపారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయించుకొని వారు వెంటనే మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రైతు రిజిస్ట్రేషన్ లో రైతుల పేర్లతో పాటు, ఆధార్ వివరాలు, భూమి వివరాలు ఇతర అవసరమైన సమాచారాన్ని కార్యాలయంలో సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రైతులు ఇబ్బంది పడకూడదని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -