నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు

నవతెలంగాణ – రాయపర్తి : నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.. ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకోవద్దు అని వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతున్నదని తహశీల్దార్ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలకేంద్రంలో  14వ ఓటరు జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన వజ్రాయుధం అన్నారు. అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి, ప్రజాస్వామ్య మనుగడను కాపాడుకోవాలంటే ఓటు హక్కు ఒక్కటే మార్గం అన్నారు. ఓటుహక్కు దేశ చరిత్రనే మార్చేయగల ప్రజాస్వామ్య ఆయుధం అన్నారు. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ సమర్థులైన పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని కల్పించింది ఓటు హక్కే అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ ఐత రాంచందర్, నాయబ్ తహశీల్దార్ సూర్య, కృష్ణమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  ఆర్ఐ చంద్ర మోహన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love