కేసీఆర్‌ చిత్రపటానికి ‘సదాశివునిపాలెం’ పూలాభిషేకం

– రోడ్ల విస్తరణ నిధుల మంజూరుకు కృతజ్ఞత
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య చిత్రపటాలకు సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం బీఆర్‌ఎస్‌ నాయకులు, గ్రామస్తులు శుక్రవారం పూలాభిషేకం నిర్వహిం చారు. సత్తుపల్లి పట్టణం నుంచి సిద్ధారం, సదాశివునిపాలెం, మర్లపాడు వరకూ రోడ్డు నిర్మాణానికి గతంలో రూ.12కోట్ల, 70లక్షలు మంజూరవగా ప్రజావసరాల దృష్ట్యా డబుల్‌రోడ్ల నిర్మాణం జరగాలన్న సండ్ర అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.27కోట్ల మంజూరు చేసింది. అదేవిధంగా గ్రామంలో రూ.కోటితో సీసీరోడ్లు, రూ.25లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. రోడ్ల విస్తరణ, కమ్యూనిటీ హాలు, గ్రామంలో అంతర్గత సీసీరోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎంకు, మంత్రికి, ఎప్పటికప్పుడు తమ సమస్యలను వినతుల రూపంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి గ్రామాభివృద్ధికి తోడ్పడిన ఎమ్మెల్యే సండ్రకు కృతజ్ఞతగా బీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్తులు వారి చిత్రపటాలకు పూల వర్షం కురిపించి కృతజ్ఞతను చాటుకున్నారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ తుంబూరు సరస్వతి, ఉపసర్పంచ్‌ కాల్నేని వెంకటేశ్వరరావు, గ్రామశాఖ అధ్యక్షులు మందపాటి సూర్యప్రకాశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తుంబూరు దామోదర్‌రెడ్డి, ఆత్మ డైరెక్టర్‌ వినుకొండ వెంకటరామయ్య, పర్సా కృష్ణ, గోపాలరెడ్డి, మూసిపట్ల సాంబశివరావు, ప్రతాప్‌రెడ్డి, సాంబశివరెడ్డి, కర్నాటి భద్రం, కోటమర్తి కృష్ణ పాల్గొన్నారు.

Spread the love