నావల్నీ మృతికి అధికార కారణం ధ్రువీకరించలేదు

నావల్నీ మృతికి అధికార కారణం ధ్రువీకరించలేదు– నావల్నీ బృంద ప్రతినిధి వెల్లడి
మాస్కో : రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మరణానికి కారణమేంటనేది దర్యాప్తు అధికారులు ఇంకా ధ్రువీకరించలేదని నావల్నీ బృందం ప్రతినిధి కిరా తెలిపారు. అధికారికంగా ఆయన మృతిపై ఒక నిర్ధారణకు రావడానికి ఎంత కాలం పడుతుందో కూడా తెలియదని నావల్నీ తల్లికి వారు తెలియచేసినట్లు చెప్పారు. మాజీ న్యాయవాది అయిన నావల్నీ ఈ నెల 16న పోలార్‌ వూల్ఫ్‌ పీనల్‌ కాలనీలో నడుస్తుండగా, అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి, మరణించారు. అక్కడ ఆయన 30ఏండ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. సడన్‌ డెత్‌ సిండ్రోమ్‌తో మరణించినట్లు నావల్నీ తల్లి లుద్మిలాకు అధికారులు తెలియచేశారని నావల్నీ బృందం తెలిపింది.

Spread the love