
లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ హెచ్ పి ఎస్ నిజమాబాద్ జిల్లా యువజన (యూత్)అధ్యక్షునిగా లౌడియా మహిపాల్ నాయక్ ఇందల్ వాయి మండలంలోని గుట్ట కింది తాండ వాసిని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఆదేశాల మేరకు జిల్లా అద్యక్షులు చౌహాన్ మోహన్ నాయక్ నియామక పత్రాన్ని అందజేసినట్లు లౌడియా మహిపాల్ నాయక్ తెలిపారు.అదివారం ఇందల్ వాయి మండల కేంద్రంలో గిరిజన యువకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా లౌడియా మహిపాల్ నాయక్ మాట్లాడుతూ త్వరలోనే జిల్లా లోని అన్ని మండలాలకు మండల కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.గిరిజన యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా అద్యక్షులకు తెలిపి వారి సూచనలు సలహాల మేరకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.జిల్లాలో ఉన్న గిరిజన యువతిని ఏకతాటిపైకి తేవడానికి ఓక వేదిక ఏర్పాటు చేసి, గిరిజన విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తామని,అని సమస్యలను సంపాదించుకోవడానికి విశేష కృషి చేస్తానని మహిపాల్ నాయక్ వివరించారు. లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా యువజన (యూత్) అద్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు బెల్లయ్య నాయక్,జిల్లా ఆధ్యక్షులు చౌహాన్ మోహన్ నాయక్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఓకే పేద్ద భాద్యతలను అప్పగించారని, దానికి తగ్గట్టు పని చేసి యూత్ ను బలోపేతం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఎం పిలుపు ఇచ్చిన ముందుంటనని వివరించారు.