మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, కార్మిక వర్గానికి చేసిందేమీ లేదు

– జాతీయ రహదారి44 పై రాస్తారోకో
– పంటలకు మద్దతు ధరల చట్టాన్ని  (ఎంఎస్ పి) తీసుకురావాలి
నవతెలంగాణ – డిచ్ పల్లి
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సీపీఐ ( యం యల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్త గ్రామీణ భారత్ బంద్  పిలుపు లో భాగంగా జాతీయ రహదారి 44 పై గంటసేపు రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు  గిట్టుబాటు ధరలు లేక దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు అత్మహత్యలు చేసుకుంటున్నారని,  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని పార్లమెంట్ లో ఎంఎస్ పి చట్టాన్ని తీసుకురావాలని , విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, ఢిల్లీలో రైతులపై భాష్వ వయువులు ఉపయోగించడం సరైనది కాదని ,ఢిల్లీ రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమంలో రైతులపై మోపిన కేసులను ఎత్తివేయాలని, బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలని , ఆటో డ్రైవర్ల ను నూతనంగా ఆర్టీసి బస్సులలో 30% శాతం నియమించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్ళుగా దేశ ప్రజలకు, ముఖ్యంగా కార్మిక వర్గానికి చేసిన మేలేమీ లేదన్నారు. ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా కాలరాస్తూ 04 కార్మిక వ్యతిరేక కోడ్ లను తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా అప్పగించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ – మతతత్వ విధానాలను ప్రతిఘటించాలన్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్ షీట్ ప్రకటిద్దామన్నారు. ఈ నేపథ్యంలోనే 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ కు దేశవ్యాప్త కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చా యన్నారు.రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలి.. కేంద్రం తెస్తున్న విద్యుత్తు బిల్లును ఉపసంహ రించుకొని రైతులకు స్వామినాథన్ కమీషన్ చేసిన సూచనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈకార్యక్రమంలో  ఎఐకెఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టీ సాయిరెడ్డి , జిల్లా సహాయ కార్యదర్శి దేవస్వామి, కృష్ణాగౌడ్, పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్, పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ , ప్రజాసంఘాల నాయకులు నగేష్, రవీందర్,మణికంఠ,  ఆటో కార్మికులు కలిం,జవిద్, సాయన్న రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love