యూనివర్సిటీ అభివృద్ధి కోసం విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా పనిచేయాలి

– పీడీఎస్ యూ రౌండ్ టేబుల్ సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పున్నయ్య
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా పనిచేయాలని , విద్యార్థి నాయకులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెమినార్  హాల్ లో పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ  ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ కు సమావేశానికి అధ్యక్షత వహించిన పి.డి.ఎస్. యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సుమారు 7000 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని , పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, యూనివర్సిటీలకు అత్యధిక నిధులు కేటాయించాలని , యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని,  తెలంగాణ యూనివర్సిటీలో  గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని డిమాండ్ చేశారు.రైతు ఉద్యమంలో మృతి చెందిన శుభన్ సింగ్ కి రౌండ్ టేబుల్ సమావేశం లో ఘనంగా నివాళులర్పించారు.రౌండ్ టేబుల్ సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (సి) డాక్టర్ దత్త హరి,ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ యూనివర్సిటీ నాయకుడు ప్రసాద్, ఎంఎస్ఎఫ్ యూనివర్సిటీ కన్వీనర్ దినేష్ ,బివిఎం యూనివర్సిటీ ఇన్చార్జి సూరజ్ , పిడిఎస్యూ నాయకులు ప్రిన్స్, దేవిక, రవీందర్, అక్షయ్, బిందు, అనూష, ప్రవిన,నవ్య,రాజేష్ నితిన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love