Monday, June 9, 2025
E-PAPER
Homeదర్వాజఇంకా ఇంకా లోపల

ఇంకా ఇంకా లోపల

- Advertisement -

తుంపర తుంపరగా వర్షం కురుస్తున్న ఉదయం
ఒట్టి బోసి పాదాలతో ఒంటరిగా నడుస్తూ వచ్చీ వచ్చీ
ఆ సముద్రం మొగపై కూర్చుంటాను
అంతా నీరే… బయటా లోపల కూడా-
చిత్రం, సముద్రం బిందువు బిందువుగా
నాలోకి ప్రవహిస్తూ ప్రవహిస్తూ ప్రవేశించడం తెలుస్తూంటుంది
అప్పుడు క్రమ క్రమంగా మొత్తం సముద్రం ఖాళీ అయి,
మాయమై ఆకాశంలోకి నిర్గమిస్తుంది-
ఆకాశంకూడా అంతే
దిగంతాలనిండా వ్యాపించీ వ్యాపించీ, విస్తరించీ విస్తరించీ వ్యాప్తమైనపుడు నేను మళ్ళీ ఒక వర్షం కురుస్తున్న మధ్యాహ్నం
కొండ కొమ్ము అంచుపై కూర్చుని లోయల్లోకి చూస్తూండగా
ఆకాశం కూలిపోవడం మొదలై… ఇంకా ఇంకా
కళ్ళముందే నిశ్శేషమైపోతూ
అంతా తెల్లని పొగమంచు పొడి పొడిగా అంతర్ధానమౌతూంటే
నెత్తిమీద ఆకాశమే లేని శూన్యంలో
గిర గిరా.. ప్రచండవేగంతో భ్రమిస్తూ ఒక సహస్రార చక్రంబి
ఇక కొండలను దిగి వస్తూ వస్తూ
నా లోపలికి నేనే తొంగి చూచుకున్నపుడు
చిత్రం.. లోపల నేను ఉండను.. అన్నీ అరణ్యాలే ఉంటాయి
విస్తరించి విస్తరించి.. పరమదట్టంగా
అప్పుడు లోపల ఏదో గాఢలుప్తత ప్రత్యక్షమై
జ్ఞాననేత్రంతో ఆవాహన చేస్తాను
ఒక అగ్ని బిందువుకోసం-
అంతర్ధహనంలో పునీతుణ్ణి కావాలికదా నేను!
– రామా చంద్రమౌళి, 9390109993

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -