ఐద్యా విస్తృత స్థాయి సమావేశం 

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ శాస్త్రి నగర్ సిఐటియు ఆఫీసులో సిపిఎం డివిజన్ కార్యదర్శి  వెంకటేశ్ ఆధ్వర్యంలో బుధవారం ఐద్వా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్  జిల్లా కార్యదర్శి సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలంటే మహిళల హక్కులను సాధించుకోవాలంటే   విద్యా వైద్యం ఉద్యోగం నిత్యవసర ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇలా అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళల్ని చైతన్యవంతులు గా చేయాలంటే ప్రతి మండలంలో ప్రతి డివిజన్లో ప్రతి వార్డులలో ఐద్వా కమిటీలో అవసరం అని అన్నారు సమావేశం ముగిసిన అనంతరం ఆర్మూర్ మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మండల అధ్యక్షురాలుగా అరుణ,’మండల కార్యదర్శి హసీనా,  జాయింట్ సెక్రెటరీ సంతోషి,;గంగమణి ఉపాధ్యక్షురాలు శాహేద క్యాషియర్ గా  మిగతా మండల కమిటీ సభ్యులు గా రిజ్వాన  జ్యోతి,  కుంతాబాయి,  చాందిని సుమేరా యమునా తదితరుల్ని కమిటీ సభ్యులు గా ఎన్నుకోవడం జరిగింది.
Spread the love