కేంద్ర ప్రభుత్వ విధానాలు మారాలి

నవతెలంగాణ –  కంటేశ్వర్
పెన్షనర్ల పట్ల ప్రభుత్వ విధా నాలు మారాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇ.పి.స్ పెన్షనర్లకు నెలకు రూ.9000 రూపాయలు పెన్షన్ చెల్లించాలని, పెన్షనర్లకు ఇన్కమ్ టాక్స్ పరిధి నుండి మినహాయింపు ఇవ్వాలని, కమిటెడ్ వ్యాల్యూ ఆఫ్ పెన్షన్ను(సీ.వి.పి) 15 సంవత్సరాల నుండి 13 సంవత్సరాలకు కుదించాలని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లాశాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కు వారు మద్దతు ప్రకటించారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు ఈ సమ్మెకు జిల్లా అధ్యక్షులు రామ్మోహన్రావు, కార్యదర్శి ఎస్ మదన్ మోహన్ డివిజన్ అధ్యక్షులు సిర్ప హనుమాన్లు, కార్యదర్శి అందేసాయిలు,జిల్లా నాయకులు భోజారావు లావు వీరయ్య, రాధాకృష్ణ , బట్టి గంగాధర్, లక్ష్మీనారాయణ , పూర్ణచంద్రరావు, శిర్ప లింగయ్య, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love