
మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బుధవారం జాతీయ విజ్ఞాన శాస్త్ర (సైన్స్ డే) దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని క్రిష్ణవేణి పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తనదైన శైలిలో నూతన ఆవిష్కరణలతో ఔరా అనిపించారు. విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన సౌర వ్యవస్థ, ఋతువులు, విద్యుత్ సరఫరా, నీటి వనరులు, కిరణ జన్య సంయోగ క్రియ, శ్వాస వ్యవస్థ ప్రాముఖ్యత, మొక్కల అంకురు ఉత్పత్తి, మానవ విసర్జక వ్యవస్థ, సమగ్ర వ్యవసాయ వ్యవస్థ, మురికి నీటి శుద్ధి కేంద్రం తదితర నమూనాలను తయారు చేసిన విద్యార్థులు వాటి గూర్చి సమగ్రంగా వివరించారు.విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థులు మూడు భాషల్లో ఉపన్యాసాన్ని ఇచ్చారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించిన విజ్ఞాన శాస్త్ర పరికరాలు చూపరులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన పరికరాలను, నమూనాలను పరిశీలించిన పాఠశాల యజమాన్యం విద్యార్థులను అభినందించింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికి విజ్ఞాన శాస్త్రం అవసరమని, విజ్ఞాన శాస్త్రం లేని వ్యవస్థ లేదని అన్నారు.1986 లో నేషన్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం గా జరపాలని అప్పటి భారత ప్రభుత్వాన్ని కోరిందని గుర్తు చేశారు.అప్పటి ప్రభుత్వం అంగీకరించి 1987 నుంచి ప్రతి సంవత్సరం 28న విజ్ఞాన శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. విజ్ఞాన శాస్త్ర శాస్త్రవేత్త సివి రామన్… రామన్ ఎఫెక్ట్ కనుగొన్న పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును జ్ఞాపకార్థంగా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం గా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. మిగతా దేశాలతో మన దేశాన్ని సమానంగా నిలపడంలో ప్రపంచ స్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో ఇంకా ఎన్నో సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పాత్ర, శాస్త్రజ్ఞుల పాత్ర విలువ కట్టలేనిదని అన్నారు. జాతీయస్థాయిలో సైన్స్ స్ఫూర్తిని చాటడం విజ్ఞాన శాస్త్ర దినోత్సవ లక్షమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చెట్లపల్లి సుధాకర్ గౌడ్, పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ చిలుక గంగ ప్రసాద్, పాఠశాల డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ కుందారం సచిన్, పాఠశాల డైరెక్టర్ జుంబరత్ రణధీర్ ఉపాధ్యాయులు కమల్, స్వప్న, రూప శ్రీ, మనోజ్ఞ, షాహిన్,రమ్య, తబసుమ్, నిఖిత, తదితరులు పాల్గొన్నారు.
బషీరాబాద్ లో: జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని బషీరాబాద్ మండల ప్రజా పరిషత్ పాఠశాల సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ఎగ్జిబిట్స్ ను ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, సీనియర్ ఉపాధ్యాయులు మధుసూదన్, వీడిసి చైర్మన్ బాజన్న, ఎస్ఎంసి మాజీ చైర్మన్ శ్రీనివాస్, డాక్టర్ మురళి హాజరై తిలకించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ గౌడ్, సి.మోహన్, కవిత , ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.