
– కమిషన్ల కోసం పనిచేసిన ప్రజాప్రతినిధలు
– అక్షింతల పేర బీజేపీ రాజకీయం
– జీరో కరెంట్ బిల్లు కార్యక్రమాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అరు గ్యారంటీ హామీ పథకాల్లో పదవిలో కొచ్చిన 48 గంటల్లోపే రెండు హామీలను అమలు చేశామని ఇప్పుడు ఇంకో రెండు హామీలను అమలు చేస్తున్నామని,గడిచిన 10 ఏళ్ల బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ ఏమి లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి బిజెపి, బిఆర్ఎస్ పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. డిచ్ పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గృహజ్యోతి పథకంలో భాగంగా జీరో కరెంట్ బిల్లు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్వయంగా నడిపల్లి గ్రామంలోని రెండు, మూడు నివాస గృహాలు తిరిగి కరెంట్ బిల్లును మిషన్ ద్వారా స్కాన్ చేసి లాబ్దిదారులకు జీరో బిల్లులను అందజేశారు. విద్యుత్తు 200 యూనిట్లు కంటే తక్కువ కావడంతో జీరో బిల్లు వచ్చిందని వివరించారు. అనంతరం నడ్ పల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడారు. జిల్లాలో మొత్తం 49 లక్షల లబ్ధిదారులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రూరల్ సెగ్మెంట్లో 47 వేల 710 లబ్ధిదారులు ఉన్నట్లు ఆయన వివరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004 లో వ్యవసాయ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, యూనివర్సిటీలు,త్రిబుల్ ఐటీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. 2024 లో సీఎం రేవంత్ రెడ్డి అభయహస్తం అరు గ్యారంటీ లలో బాగంగా నేడు, 500గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి లో భాగంగా విద్యుత్ వినియోగదారులు ప్రతి ఇంటికి 200 యూనిట్లు కాలుస్తే వారందరికీ జీరో బిల్ వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ప్రక్రియ కొనసాగుతుందని, ఆరు పథకాల్లో రెండిటిని పూర్తి చేశామని ఆయన వివరించారు.మహిళలకు ఫ్రి బస్సుల్లో 16కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేశారని గుర్తు చేశారు.ఇల్లు స్వంతంగా ఉన్న , అద్దె ఉన్న వారికి కూడా జీరో బిల్లు వస్తుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్ని నాణ్యత లోపం: రాష్ట్రంలో బీఅర్ఎస్ అధికారంలో ఉన్న పది ఏళ్ళు చేసిన పాలనలో కట్టిన ప్రాజెక్టుల పేరు దోచుకున్నారని,సిఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాజెక్టు సందర్శన కు వెళ్తుంటే మేడిగడ్డకు కెసిఆర్ బొందల గడ్డ అన్నాడని అదే కేటీఆర్ అక్కడికి వెళ్లి పోస్టులు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదన్నారు. మేడిగడ్డ కుంగిపోయిందని, కాలేశ్వరం అసలే పనికిరాదని, అన్నారం ప్రాజెక్టులో నీళ్లు లేవని అనవసరంగా ప్రాజెక్ట్లు నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వివరించారు.గృహ జ్యోతిలో భాగంగా సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వబడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ₹500 గ్యాస్ ఇస్తామంటే బిజెపి ప్రభుత్వం దిగివచ్చి 200 సిలిండర్ వేంట తగ్గించిందని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. సిలిండర్ తీసుకున్నప్పుడు మొదటగా మొత్తం డబ్బులు చెల్లించాలని అనంతరం మిగిలిన డబ్బులు సంబంధిత కన్జ్యూమర్ ఖాతాలో జమ చేయబడతాయని ,ఎలాంటి అనుమానాలు పడవద్దని సూచించారు. ప్రస్తుతం సిలిండర్ ధర వెయ్యి రూపాయలు ఉంటే మొదటగా సిలిండర్ కు వెయ్యి రూపాయలు మొత్తం చెల్లించి 48 గంటల్లోనే 500 రూపాయలు సంబంధిత సిలిండర్ కన్జ్యూమర్ ఖాతాల్లో జామ చేయబడతాయని వివరించారు.
నియోజకవర్గానికి 3500 ఇండ్లు: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఇల్లు లేని వారికి మొట్టమొదటగా నిరుపేదలను అర్హులుగా గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కరెంటు సంక్షేమ పథకాలే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాయని బిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల లోచేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.త్వరలోనే రైతు రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని, ఇప్పటికే రైతు రుణమాఫీ కోసం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగిందని రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వ కట్టుబడి ఉన్నట్లు త్వరలో రుణమాఫీ సంబంధించిన విధి విధానాలు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అదేవిధంగా రైతు భరోసా కింద రైతులకు వచ్చే ఖరీఫ్ పంట నుండి లబ్ధి చేకూరుతుందని వివరించారు. అర్హులైన రైతులకు రైతు బంధు వర్తింప చేస్తామన్నారు.బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కాకుండా 500వందల ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు ఇచ్చిందని పంట పండిన పండక పోయిన బీడు భూముల కూడా రైతుబంధుని ఇచ్చి ప్రజా ప్రతినిధులకు లాభం చేకూర్చారని అన్నారు.కాంగ్రెస్ అదికారంలోకి వచ్చిన వెంటనే నర్సులు, పోలిస్ ఉద్యోగాలు కల్పించిందని, నూతనంగా డిఎస్పీ వేసినట్లు వివరించారు డిచ్ పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను వంద పడకల ఆసుపత్రిగా మారుస్తామని,ఇందల్ వాయి లో ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటుకు అ శాఖ మంత్రి పి విన్నవించినట్లు తెలిపారు. మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ ప్రారంభించి, చెరువు దగ్గర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.డిచ్ పల్లి,ఇందల్ వాయి వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ సహాయంతో రైల్వే అండర్ గ్రౌండ్ వంతెన నిర్మాణం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు.
రామాలయం ప్రారంభించక ముందే అక్షింతల పంపిణీ: రాముడంటే అందరికీ భక్తి భావాలు కలిగిన వాడేనని బిజెపి రామాలయం నిర్మించి ప్రారంభించక ముందే గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ అక్షింతలు పంపిణీ చేసి రాజకీయ రంగు పులిమిందని, రామాలయం పేరు చెప్పి ఓట్లు దండుకోవడానికి చేస్తున్న నాటకమని కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయకుండా అన్ని కులాలను మతాలను గౌరవిస్తూ అభివృద్ధి చేసి కోట్లు అడుగుతుందని మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఉస్మానించారని ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, జీరో బాలన్స్ ఖాతా కలిగి ఉన్నవారికి 15 లక్షలు అకౌంట్లో వేస్తారని బూటకపు మాటలు మాట్లాడారని దేశం కోసం ధర్మం కోసం అని కొత్త నాటకానికి తరలించాలని అలాంటి వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు ప్రస్తుత ఉన్న ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబ నేపథ్యమే కాంగ్రెస్ అని ఇప్పుడు ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం తగదన్నారు.
ఉత్పత్తి లేకనే పసుపు ధర పెరుగుతుంది: రాష్ట్రంలో జిల్లాలో పసుపు ఉత్పత్తి ఎక్కువగా ఉందని పసుపు రైతులు ఈ సీజన్లో ఎక్కువ మొత్తంలో పసుపు పండించలేరని, దీంతో మార్కెట్లో పసుపు లేక సమాంతం పసుపు ధర పెరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు. దీనికి బిజెపి నాయకులు పసుపు ధర పెంచుతుంది మేమే అన్నట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎక్కడైతే తక్కువ పంట పండిస్తారో ఆ పంట ఉత్పత్తి లేక ధర అమాంతం పెరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.తమ ప్ర ప్రభుత్వం బీసీ కులగరణ చేస్తామంటే బిజెపి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ కుల గణన వెంటనే చేపట్టా డానికి కేంద్ర ప్రభుత్వం సహకరించా లన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, కిసాన్ ఖెత్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ ఈ రవీందర్,డిఈ జాన్ ఉత్తం,ఎడఇఈ శ్రీనివాస్,ఎఈ సాయిలు, సొసైటీ చైర్మన్లు రంచందర్ గౌడ్, తరచంద్ నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్ శ్యాంసన్, ధర్మ గౌడ్, డాక్టర్ శాదుల్లా, వాసు బాబు, పోలసాని శ్రీనివాస్, డాక్టర్ జాహుర్, డి ఎల్ పి ఓ శ్రీనివాస్ గుప్తా, తహసిల్దార్,ఎంపిఓ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి నిట్టు కిషన్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.