7వ బెటాలియన్ లో దుద్దిల్ల శ్రీపాద రావు జయంతి

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్పల్లి లో కమాండెంట్  బి. రాంప్రకాష్ ఆధ్వర్యంలో దుద్దిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకలను అసిస్టెంట్ కమాండెంట్ యం. శ్రీనివాస్ రావు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ దుద్దిల్ల శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆసిస్టెంట్ కమాండెంట్  మాట్లాడుతూ దుద్దిల్ల శ్రీపాద రావు  చేసిన సేవలను, అతని రాజకీయ జీవితం గురించి వివరించారు. ఈ  కార్యక్రమము లో ఆర్.ఐలు పి. వెంకటేశ్వర్లు, ఆర్. ప్రహ్లాద్, యం. నరేష్, ఆర్.యస్. ఐ.లు సిబ్బంది పాల్గొన్నారు
Spread the love