నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పలు గ్రామాలలో ముఖ్యమైన రోడ్ల వెంట ఈదురుగాలి, వర్షం, బీభత్సం వలన పెద్ద పెద్ద వృక్షాలు రోడ్లపైన నేలకొరిగాయని జుక్కల్ ఎస్సై తెలిపారు. ఇవే కాకుండా గ్రామాలలో గాలివానతో రేకుల షెడ్డు ఉన్న ఇండ్లపై రేకులు గాలిలోకి లేచి కిలోమీటర్ పొడవున దూరాన వెళ్లి పడిపోయాయి. ఈదురు గాలి వాన బీభత్సంతో మండలంలోని బస్వాపూర్ – కేంరాజ్ కల్లాలి గ్రామాల మధ్య ఉన్న రోడ్లు భవనాల శాఖ రోడ్డుపైన ఒక మహా వృక్షం కూలిపోయింది. దీంతో రోడ్డుపైన వాహనదారులకు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది . అదేవిధంగా జుక్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో బసవేశ్వర చౌక్ వద్ద ఇంకో చెట్టు రోడ్డుపై పడి పోవడంతో జుక్కల్ నుండి బిచ్కుంద, ఇతర గ్రామాలకు వెళ్లడానికి ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియడంతో జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలాలను చేరుకున్నారు. అనంతరం రెడ్డుపైన చెట్లను తొలగించి, ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేశారు.
ఈదురు గాలుల బీభత్సం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES