అన్నారంలో రంగురాళ్ల విక్రయ కలకలం

నవతెలంగాణ – రామారెడ్డి
 మండలంలోని అన్నారంలో రెవిన్యూ భూమిలో రంగురాలు తవ్వి విక్రయించారు. గ్రామానికి చెందిన చిన్న లక్ష్మీ గంగాధర్, అన్నారం రెవిన్యూ శివారులోని సున్నపురాళ్ల తండా ప్రాంతంలో గల  288 సర్వే నెంబర్లో కుటుంబ సభ్యుల పేరు పైన గల ఐదు ఎకరాల్లో రంగురాళ్లను తవి, బ్రోకర్లకు, ట్రాక్టర్ లోడు రూ 5 వేలకు, మూడు లోడ్లు రంగురాలు విక్రయించినట్లు అడవి అధికారుల విచారణలో గంగాధర్ వెల్లడించారు. సంఘటనపై ఇన్చార్జి ఎమ్మార్వో లక్ష్మన్ను వివరణ కోరగా మా దృష్టికి రాలేదని, నేడు విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అడవి అధికారులు రగుర్రాళ్ళు త్రవ్విన స్థలాన్ని పరిశీలించారు.
Spread the love