నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర షెడ్యూలు కులాల స్టడీ సర్కిల్ వారు రాష్ట్ర స్థాయి ఉద్యోగ పోటీ పరీక్షలకు గాను నిజామాబాద్ లో తలపెట్టిన ఐదు(05) నెలల ఉచిత శిక్షణ కొరకు తేది. 10/03/2024 నాడు కేర్ డిగ్రీ కళాశాలలో ఉదయం 11.00గం.ల నుండి మధ్యాహ్నం 1.00గం. వరకు నిర్వహింపబడే అర్హత ప్రవేశ పరీక్ష నిమిత్తమై హాల్ టికెట్లును తేది.07/03/2024 నుండి www.tsstudycircle.co.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని పత్రికా ప్రకటన ద్వారా అభ్యర్ధులకు బి.శశికళ షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి, ఇన్ ఛార్జ్ డైరెక్టర్ రాజగంగారం లు బుధవారం సంయుక్తంగా తెలియజేశారు. పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఆదార్ కార్డు తీసుకొని పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందే చేరుకోవాలని సూచించారు.