మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి రెండు రోజులపాటు జైలు శిక్ష

– వివరాలు తెలిపిన నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి నారాయణ
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి బుధవారం ఆరుగురికి వి. వెంకటనారాయణ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్  కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం మార్నింగ్ కోర్టులో, కోర్ట్ కానిస్టేబుల్ మాన్సింగ్ 663 ఎస్కార్ట్ తో కోర్ట్ లో  మెజిస్ట్రేట్  సయ్యద్ ఖదీర్ ముందు హాజరు పరిచినట్లు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి నారాయణ బుధవారం తెలియజేశారు.  మెజిస్ట్రేట్ 6100 రూపాయల జరిమానా విధిస్తూ , అందులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని అని ట్రాఫిక్ ఏసిపి ఏ. నారాయణ తెలియజేశారు. జైలు శిక్ష పడిన వ్యక్తి యొక్క పూర్తి వివరాలు నిజామాబాద్ జిల్లా కాలూరు గ్రామం కి చెందిన వెంకట రమణకు రెండు రోజులపాటు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఏసిపి నారాయణ బుధవారం తెలియజేశారు.
Spread the love