బీఎల్ఎఫ్ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గా సబ్బని లత

నవతెలంగాణ – కంటేశ్వర్
బీఎల్ఎఫ్ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గా సబ్బాని లతాను కో కన్వీనర్ గా మేత్రి రాజశేఖర్లను నియమించినట్లు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో జరిగిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బీఎల్ఎఫ్ నిజామాబాద్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ కమిటి కన్వీనర్ గా సబ్బని లత,కో- కన్వీనర్ గా మేత్రి రాజశేఖర్ లను నియమించినట్లు బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ విడుదల చేశారు. సభ్యులు గా  కె. శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్,  కె.మధు  నిజామాబాద్ అర్బన్,  ఎ. అశోక్  గౌడ్ బాల్కొండ, బి. జగదీష్ బాల్కొండ, రూరల్ ఆకుల సుజాత రూరల్ , ఎండి సయ్యద్ నిజామాబాద్ రూరల్, మోసిన్ బోధన్,బాల్ రాజ్ బోధన్ , టి. రాజు నిజామాబాద్ అర్బన్, జి.శ్రీమాన్ నిజామాబాద్,   ఎం.అజయ్ నిజామాబాద్ అర్బన్ ,దండు  జ్యోతి ఆర్మూర్ , టి . అంజయ్య నిజామాబాద్ రూరల్, సంగీత  బోధన్, కోరుట్ల , జగిత్యాల లకు అబ్బగోని అశోక్ గౌడ్, బ్రాహ్మణపల్లి జగదీష్ లను ఇంచార్జీలుగా నియమించినట్లు దండి  వెంకట్ ప్రకటించారు.
Spread the love