
ఇందల్ వాయి మండలంలోని గుట్ట కింది తండా లో శనివారం సీసీ రాహదరి నిర్మాణా పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అద్యక్షులు లౌడ్య మహిపాల్, గౌరారం ఎంపీటీసీ మలవత్ జమున పరశురామ్, విడిసి చైర్మన్ ఫుల్సింగ్ లతో కలిసి శనివారంప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన 3 నేలల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సహకారం తో 2 లక్షల రూపాయలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో నిధులను మంజూరు చేశారని తండా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో రాజు, గంగారాం నాయక్, దరసింగ్, జైందర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.