
నవతెలంగాణ – గోవిందరావుపేట
సాహితి మృతికి కారణమైన అధికార పార్టీ పెద్దమనిషి కొడుకును కఠినంగా శిక్షించాలని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని సండ్రగూడెం గ్రామంలో మహిళా మోర్చా మండల మహిళా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జ్యోతి హాజరై మాట్లాడుతూ.. ములుగు జిల్లా వెంకటాపుర్ మండలం ఆలుబాకా గ్రామానికి చెందిన సాహితీ అనే అమ్మాయి హైదరాబాద్ హాస్టల్లో గురువారం రోజున ఫ్యానుకు ఊరి వేసుకొని చనిపోవడం జరిగింది. సాహితి మృతికి అధికార పార్టీ నేత కొడుకు వేధింపులే కారణమని వినిపిస్తున్న విషయాన్ని గుర్తించి సాహితి కి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చినా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆ చావుకు కారణమైన వాళ్లకు సరైన శిక్ష విధించాలని మలుగు జిల్లా మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం అన్నారు. సరైన న్యాయం జరగకపోతే మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను ఉదృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఆజ్మీర లలిత బూత్ అధ్యక్షురాలు, అజ్మీర వీరమ్మ, స్వరూప, జ్యోతి, రమ్య, సమ్మక్క, విజయ, రేణుక, రాజా శృతి, షాకి బుజ్జి మార్క్ తదితరులు పాల్గొన్నారు.