– కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సామెల్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
భారత స్వతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని కాపాడుకు నేందుకు ముందుకు రావాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సామెల్ పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ 116వ జయం తిని పురష్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని ఆయన విగ్రహానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. బాబు జగ్జీవన్ రామ్ జన్మించి 116సంవత్సరాలు గడుస్తున్న ఇంకా నిమ్న వర్గాల అభివృద్ధికి నోచుకోలేద న్నారు. ఆయన చదువుకునే రోజుల్లో రెండు గ్లాసుల పద్ధతి ని అడ్డుకున్నారన్నారు. దేశ ఉప ప్రధానిగా బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా రావాల్సిన హక్కు లను పార్లమెంట్‌లో స్వపక్షమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ప్రపాతిపదికన కార్పొరేషన్ రుణాలు వస్తున్నా యంటే ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని అం బేద్కర్ పోరాడితే జగ్జీవన్ రావు చట్టసభల్లో దాన్ని అమలు చేయించిన గొప్ప పోరాట యోధుడన్నారు. ఆయన జీవి తం నేటి యువతకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత బండి సత్తన్న, నాయకులు సీహెచ్ ఎల్లేష్, ఆనంద్ , సీహెచ్ బుగ్గరాములు, యాదగిరి పాల్గొన్నారు.