మహిళలకు ఓటర్ అవగాహన కార్యక్రమం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ మంగళవారం గ్రామ మహిళలకు ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈనెల 25లోపు ఓటు హక్కు కోసం బిఎల్ఓ ల దగ్గర లేదా మీ సేవ కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కచ్చితంగా మే 13న లోక్ సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ఓటర్ కార్డుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు అవకాశం ఉందని దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రలోభాలకు లొంగకుండా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్  శరత్, సెర్ఫ్ మండల ఏపిఎం కుంట గంగాధర్, గ్రామ సమైక్యల సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love