
దేశం, రాష్ట్రం గ్రామాలలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ అన్నారు.మంగళవారంహనుమాన్ జయంతి సందర్భంగా డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామంలోని హన్మన్ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 5 గంటలకు స్వామివారికి అభిషేకం చందూరం నైవేద్యం ను భక్తి శ్రద్ధలతో హనుమాన్ భక్తులు గ్రామస్తులు తో కలిసి చేయడం అభినందనమన్నారు. ప్రతి ఏటా హనుమాన్ జన్మదిన పుట్టిన గ్రామంలో గ్రామస్తులతో కలిసి చేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందని గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అందరూ ఆనందంగా ఐకమత్యంగా ఉంటు పంటలు సమృద్ధిగా పండాలని ఆయన ఆకాంక్షించారు. హనుమాన్ సేవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడమే కాకుండా గ్రామంలో ఉన్న వేలాది మందికి సరిపడా అన్నదానం భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేపట్టడం హరిసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ సేవ సమితి సభ్యులు రాజ్ కుమార్, చిన్న రాజన్న, సచిన్, సుమన్, శక్కర్ల పెద్ద రాజన్న, రాజేష్,ఎల్ దత్తు, ఒడ్డెం నర్సయ్య,తో పాటు సభ్యులు గ్రామస్తులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.