ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు ఫర్నిచర్ సిద్ధం చేస్తున్న కార్యదర్శి

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో రాబోవు ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఫర్నిచర్ ను సాటాపూర్ గ్రామ కార్యదర్శి మహబూబ్ అలీ ప్రాథమిక పాఠశాల నుంచి తీసుకున్నారు. నేటితో పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ముందు జాగ్రత్తగా ఫర్నిచర్ ను ప్రధాన ఉపాధ్యాయుల నుంచి తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామంలో నాలుగు పోలింగ్ కేంద్రాలకు సరిపడ ఫర్నిచర్ ను పాఠశాల నుండి సేకరించినట్లు ఆయన తెలియజేశారు.
Spread the love