Tuesday, June 17, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ ఘనంగా ఖానాపూర్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు..

 ఘనంగా ఖానాపూర్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పుట్టినరోజు వేడుకలను జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆర్ఆర్ బంకట్ హాల్లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా ఉన్న సమయాల్లో  ఆ పార్టీ నుంచి 30 సంవత్సరాల చరిత్రను తిరగరాసి ఖానాపూర్ ఎమ్మెల్యేగా  బొజ్జూ పటేల్ గెలిచారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తను ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అనంతరం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను  బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల లోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు  బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -