నవతెలంగాణ – నెల్లికుదురు
ఎర్రజెండాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు సీఐటీయూ మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు మాజీ మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గడ్ సీపీఐ మండల కార్యదర్శి వారి పల్లి వెంకన్న అన్నారు. మండల కేంద్రంలో మేడే కార్మిక దినోత్సవం పురస్కరించుకొని బుధవారం వివిధ రంగాల కార్మికులు జెండాను ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు సీఐటీయూ మండల కార్యదర్శి సీనియర్ అంగన్వాడి టీచర్ తోట్ల వెంకటలక్ష్మి బాబు గౌడులతో కలిసి జండా అవిష్కరించారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి వరి పల్లి వెంకన్న జెండాను ఆవిష్కరించారు. మరియు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండపల్లి వెంకటేశ్వర్లు అనిల్ వీరన్న జెండాను ఆవిష్కరించారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఐ ఎఫ్ టు యు ఆధ్వర్యంలో నాయకులు ఆలకుంట్ల సాయిలు జాటోతు బిక్షపతి జెండా ఆవిష్కరించారు. మరియు తెలంగాణ రాష్ట్ర క్యాబ్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సుధ గాని ఉపేందర్ కుండ బోయిన అశోక్ ప్రవీణ్ ప్రభాకర్ నవీన్ నాగరాజు మహేష్ ప్రవీణ్‌లు జెండాను ఆవిష్కరించారు. బైక్ మెకానిక్ ఆధ్వర్యంలో సంపత్ వెంకటేష్ తో కలిసి సంఘం సభ్యులు జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆయా రంగాల కార్మికులు పాల్గొన్నారు.