హక్కుల సాధనకై ఏఐవైఎఫ్ నిరంతర పోరు

– ఘనంగా ఎఐవైఎఫ్ 65వ ఆవిర్భావ వేడుకలు 
– ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఏఐవైఎఫ్ నిరంతరం పోరు చేస్తుందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవాన్ని  సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐవైఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారు. సిపిఐ పార్టీ కార్యాలయం ఎదుట యువజన సంఘం జెండాను ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని బిజెపికి ఓటు అనే ఆయుధంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని అన్నారు. దేశ ప్రజల మధ్య విచ్చిన్నకర వైషమ్యాలను సృష్టిస్తూ మరల అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగీర్ సత్యనారాయణ, గడిపే మల్లేశ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్ , కొమ్ముల భాస్కర్, అయిలేని సంజీవరెడ్డి, గడిపె శివ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love