ప్రజలకు మెరుగైన విద్యుత్తు అందించడమే లక్ష్యం: ఏ డి ఈ పాపిరెడ్డి 

నవతెలంగాణ – నెల్లికుదురు
ఈ వేసవి కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మెరుగైన విద్యుత్తును అందించడమే లక్ష్యమని విద్యుత్ శాఖ అధికారి ఏడిఈ పాపిరెడ్డి ఏఈ సింధు అన్నారు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో అదనంగా 63వ కెవి  ట్రాన్స్ఫార్మర్ ను శనివారం సబ్ ఇంజనీర్ హరీష్ తో కలిసి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ బీసీ కాలనీ ఇంతకుముందు 65 కెవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉందని దానిమీద అదనంగా లోడ్ ఉండడంతో ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అయ్యి విద్యుత్ కి అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు అని అన్నారు. అది గుర్తించిన మా అధికారులు వెంటనే ఎస్టిమేట్ వేసి అదనంగా మరో 65 కెవి ట్రాన్స్ఫార్మర్ను అందించామని అన్నారు. ఇప్పుడు దీంతో ఆ బీసీ కాలనీలో విద్యుత్తు సమస్య లేకుండా పోయిందని అన్నారు అక్కడ ప్రజలు సంతోషంగా ఉండటమే మా విద్యుత్ అధికారుల లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎల్ ఐ పెద్దాపురం ఎల్ఐ యాకూబ్ ఎల్ ఎం చలమయ్య ప్రవీణ్ వెంకన్న తో పటు కొంతమంది పాల్గొన్నారు.
Spread the love