సురేష్ షెట్కార్ గెలుపు కోసం మండే ఎండలో ఎమ్మెల్యే ప్రచారం..

నవతెలంగాణ – జుక్కల్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అయిన సురేష్ షెట్కార్ గారిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సురేష్ షెట్కార్ గారిని ఎంపీగా గెలిపిస్తే తనతో సమన్వయం చేసుకుంటూ అటు కేంద్రం ఇటు రాష్ట్రం నుండి నిధులు తీసుకొచ్చి జుక్కల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. గతంలో సురేష్ షెట్కార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. నారాయణ్ ఖేడ్ జుక్కల్ నియోజకవర్గాల మధ్య త్వరలో అతి పెద్ద ఫార్మా సిటీ రాబోతుందని..యువకులకు,నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఇక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. అందుకే ఆలోచించి అభివృద్ది చేసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ షెట్కార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు..
ఈ ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారితో పాటు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love