డాక్టరేట్ పొందిన మారుముల గ్రామీణ విద్యార్థి

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్  మండలం లాడేగాం గ్రామావికి చెందిన సుర్నార్ బాలాజీ గ్రామీణ ప్రాంతంలో విద్యనబ్యసించి , ఉస్మానీయ యూనివర్సీటిలో పీజీ అయిన తరువాత యూనివర్సిటిలో హింది విభాగంలో సమకాలిన హింది “ఉపన్యాసమే మానవీయ మూల్య ” అనే విషయం పై పీ హెచ్ డి పూర్తీ చేసారు. మారుముల జుక్కల్ మండలంలోని గ్రామీణ ప్రాంతం నిరుపేద కుటుంబం నుండి వచ్చి డాక్టరేట్ (పీ హెచ్ డీ ) సాదీంచడం పై గ్రామస్తులు తల్లిదండ్రులు , మిత్రులు అభినందించారు. మార్గదర్శకులుగా , సూపర్ వైజర్ గా డాక్టర్ అప్సరునిసా బేగం , హెచ్ఓడిగా ప్రోఫేసర్ మాయాదేవి, బివోఎస్ గా డాక్టర్ సంగీత వ్యాస్ పరిశోదనలో సహకారం అందించారు. వారి చేతుల మీదుగా ఉస్మానియ యూనివర్సిటిలో డాక్టరేేట్ పట్టా పొందారు. ఇక నేటి నుండి డాక్టర్ బాలాజీగా పిలవడం చాలా గర్వంగా ఫీల్ ఉందని మిత్రులు తెలిరారు.
Spread the love