
మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ భారాస పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత ను గెలిపించాలని కోరుతూ.. సోమవారం మండల పార్టీ ఆద్వర్యంలో శ్రీరామగిరి, రావిరాల, మునిగలవీడు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం చెందుతుందని అన్నారు. రైతు రుణమాఫీ వెంటనే చేస్తానని చెప్పి కాలయాపన చేసి మళ్లీ ఆగస్టులో చేస్తానని ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండగడం కోసమే ఆగస్టు పేరు చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు ప్రజలు రాష్ట్రంలో సంతోషంగా ఉండాలని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని అందుకోసం మళ్లీ బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపిస్తున్నామని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత గెలిస్తే ప్రజల కష్టాలు తొలగిపోతాయని అందుకోసం ఈ మండలం నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చేందుకు కార్యకర్తల సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, మాజీ జిల్లా రైతుబంధు చైర్మన్ బాలాజీ నాయక్, మండల రైతు బంధు చైర్మన్ కాసం వెంకటేశ్వర రెడ్డి ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు బత్తిని అనిల్ గౌడ్ మాజీ సర్పంచులు నల్లాని నవీన్ రావు, బిక్కు నాయక్, ఎంపీటీసీ ఆదూరి శుభాషిణి కళాధర్ రాజు, సొసైటీ వైస్ చైర్మన్ బొజ్జ నాయక్ వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, వెంకట చారి , భూక్యా సూర్య ప్రకాష్, మండల నాయకులు వెన్నకుల శ్రీనివాస్, నల్లాని ప్రవీణ్ రావు, నిహల్ బాబు తదితరులు పాల్గొన్నారు.