నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని కౌలాస్ గ్రామములో గ్రామ పార్టీ అద్యక్షుడు గంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ యూత్ విబాగంతో కలిసి గురువారం నాడు గడప గడపకు తిరిగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, సంక్షేమ పథకాలను ఒక్కోక్కటిగా అమలు చేస్తున్న సర్కారు రాబోయే రోజులలో పార్టీ బలోపేతంతో పాటు , ప్రజల బలం పెర్గి జహిరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కార్ ను భారీగా మెజార్టీ ఇవ్వలనే ఉద్దేశంతో గ్రామములో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరడం జర్గింది. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.